కొత్త తరహాలో వాణిజ్యం, పెట్టుబడులు: విదేశాంగ శాఖ

చెన్నై: భారత పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులపైనే ఇరు దేశాధినేతలు ప్రధానంగా చర్చించారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. వాణిజ్యలోటును పరిష్కరించడానికి కొత్త యంత్రాంగాన్ని రూపొందించనున్నట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే పేర్కొన్నారు. ఈ నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు చైనా వైస్ ప్రీమియర్, భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు.