న్యూఢిల్లీ : కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో అత్యవసర పని మినహా మిగతా వాటికి జనాలు బయట తిరగడానికి వీల్లేదని అధికారులు తేల్చి చెప్తున్నారు. అయితే ఆ అత్యవసర పని నిమత్తం గడప దాటిన మరుక్షణం నుంచి మాస్క్ తప్పనిసరి. దీంతో మార్కెట్‌లో వాటి డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో.. దొరికిందే చాన్సని కొందరు రెట్టింపు ధరలకు అమ్మడం ప్రారంభించారు. దీనిపై మండిపడ్డ ప్రభుత్వం మాస్కులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వాటి రేట్లు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే మాస్కుల కోసం దుకాణాల వెంట తిరగాల్సిన పని లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్తున్నారు. (లోక్‌సభలో ‘ఉన్నావ్’ రభస)
ఇంట్లో మాస్క్ తయారు చేసిన స్మృతి ఇరానీ